అయోధ్యవాసుల దశ తిరిగింది.. భూముల ధరలకు రెక్కలు.. గజానికి అంత రేటా..?
అయోధ్యవాసుల దశ తిరిగింది.. భూముల ధరలకు రెక్కలు ...
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నాటి నుంచి అయోధ్యలో భూములు, ఆస్తుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడైతే అక్కడ భూముల ధరలు ఓ మహానగరంలో ఉండేంత పలుకుతున్నాయి. అయోధ్య రామ మందిర పరిసరాలే కాకుండా.. పట్టణ శివార్లలోనూ భూముల ధరలు భారీగా పెరిగాయి. ఫైజాబాద్ రోడ్ రీజియన్‌లో 2019లో చదరపు అడుగు ధర రూ.400-700 మధ్య ఉండగా.. గత ఏడాది అక్టోబర్ నాటికి రూ.1500-3000కు చేరుకుంది. అయోధ్య నగరంలో యావరేజ్‌గా చదరపు అడుగు భూమి 2019లో సగటున రూ.1000-2000 వరకు ఉండగా.. ప్రస్తుతం అది రూ.6 వేల వరకు చేరుకుంది.
అయోధ్యకున్న ప్రాధాన్యం దృష్ట్యా.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అయోధ్యలో అభినందన్ లోధా హౌస్ 25 ఎకరాల్లో ఓ రెసిడెన్షియల్ ప్లాట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. రాడిసన్, తాజ్ లాంటి హోటళ్లు ఇక్కడ భూములు కొనుగోలు చేయనున్నాయి. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL)లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రూ.14.5 కోట్లు పెట్టి ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. దాని విస్తీర్ణం ఎంతనేది అధికారికంగా తెలియకపోయినప్పటికీ.. 10 వేల చదరపు అడుగులు ఉండొచ్చని అంచనా. గజాల్లో చెప్పాలంటే.. 1111 గజాలు. అంటే ఒక్కో చదరపు గజానికి రూ.1.30 లక్షలన్న మాట. ఇక్కడ గజం రూ.1.40 లక్షలపైన పలుకుతోంది. ఇవి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న భూముల ధరలకు సమానం. బిగ్ బీ భూమి కొనుగోలు చేసిన ప్రాంతం నుంచి అయోధ్య రామమందిరానికి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే అయోధ్య ఎయిర్‌పోర్టుకు అరగంటలో వెళ్లొచ్చు.
అయోధ్య రామమందిరం ప్రారంభించిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్‌కు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. మన దక్షిణాది వాళ్లు అయోధ్య రియల్ ఎస్టేట్ పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించి ఉండకపోవచ్చు గానీ.. ఉత్తరాది ఇన్వెస్టర్లు అయోధ్యలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అప్పుడు ఎవరైనా అయోధ్యలో భూములు కొనుగోలు చేసి ఉంటే.. వారికి ఇప్పుడు దాదాపు నాలుగింత లాభం వచ్చేది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కొత్త ఇంటి కోసం అయోధ్యలో ల్యాండ్ కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలర్ ద హౌస ఆఫ్ భినందన్ లోధా (HoABL).. అయోధ్యలో అభివృద్ధి చేసిన 7 స్టార్ మిక్స్‌డ్ యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద సరయూ ప్రాజెక్టులో ఆయన ప్లాట్ కొనుగోలు చేశారు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భూమి విలువ ఏకంగా రూ.14.5 కోట్లుగా ఉంటుందని హిందుస్తాన్ టైమ్స పేర్కొంది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో అక్కడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకుంది. ధరలు ఆకాశానికి చేరుకున్నాయి.
ఈ మేరకు అయోధ్యలో తాను భూమి కొనుగోలు చేయడంపై పలు విషయాలు వెల్లడించారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో తన ఇంటిని నిర్మించడానికి ఎదురుచూస్తున్నానన్నారు. అయోధ్యలో సంప్రదాయం, ఆధునికత సహజంగా కలిగి ఉంటాయని పేర్కొన్నారు.