అయోధ్యలో 500 ఏళ్ల కల నేరవేరింది
అయోధ్యలో 500 ఏళ్ల కల నేరవేరింది
భూకంపాలు వచ్చినా చెక్కు చెదరదు అత్యంత పటిష్టంగా అయోధ్య రామమందిర నిర్మాణం హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగనుంది. రామమందిరానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మరో వెయ్యేళ్ల వరకూ మందిరానికి మరమ్మతులు అవసరం లేనంత పటిష్టంగా నిర్మాణం జరుపుతున్నారు. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 6.5 తీవ్రతలో భూకంపం సంభవించినా అయోధ్య మందిరానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. యాభై అడుగుల లోతు నుంచి మందిర స్తంభాలను తవ్వి నిర్మాణం చేపట్టారు. భారీ రాళ్లు, సిమెంట్ తదితరాలను చేర్చి వెడల్పయిన స్తంభాలతో ఈ కట్టడాన్ని రూపొందించారు. పునాదిలో ఎక్కడా స్టీల్ కానీ ఇనుము కానీ వాడకపోవడం విశేషం.
కోర్టు వివాదాల అనంతరం.. రామమందిర నిర్మాణాన్ని 2.7 ఎకరాల్లో చేపడుతున్నారు. 57,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో... 360 అడుగుల పొడుగు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మాణం రూపుదిద్దుకొంటోంది. మూడంతస్తులలో జరుగుతున్న ఈ మహత్తర నిర్మాణానికి 1800 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. విరాళాల రూపంలో 2300 కోట్ల పైచిలుకు మొత్తం వసూలు కావడం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి 22న సీతారాముల విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశంలోని చాలామంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
అయోధ్యలో రాముడు ఇక టెంట్ లో ఉండరని, ఆలయంలో ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆలయ నిర్మాణంలో ఆలస్యమయినందుకు రాముడు క్షమించాలని కోరారు. అయోధ్యలో రామమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమని మోదీ అన్నారు. టెంట్ లో కాకుండా దివ్యమైన భవ్య మందిరంలో ఉండనున్నారని అన్నారు.
వందల ఏళ్ల నాటి కల....
ఎందరో ఎదురు చూస్తున్న ఐదు వందల సంవత్సరాల నాటి కల ఫలించిందన్నారు. అయోధ్యనగరానికి మాత్రమే కాదు సరయు నదికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారన్న మోదీ ఎన్నో త్యాగాల ద్వారా దీనిని సాధించుకోగలిగామని చెప్పారు. ఎన్నో బలిదానాలు జరిగాయన్నారు. రాముడు కొలువైన చోట ఆంజనేయుడు ఉంటారని అన్న మోదీ ఈ అమృత ఘడియల్లో తాను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పదకొండు రోజులు దీక్ష చేసి ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నానని చెప్పారు.
కొత్త కాలచక్రానికి...
Real broker Properties
ఈరోజు కొత్త కాలచక్రానికి నాందిగా నిలుస్తుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి మంచి పనికీ ఎదురుదెబ్బలు తగలడం సహజమేనని, అయితే చివరకు న్యాయం గెలుస్తుందని చెప్పడానికి ఈ ఆలయ నిర్మాణమే ఉదాహరణ అని మోదీ అన్నారు. తన మనసంతా బాల రాముడి రూపంపైనే ఉందన్న మోదీ, కొన్ని వందల నాటి ఏళ్ల నిరీక్షణ ఫలించిందని చెప్పారు. ఇప్పుడు అయోధ్యలో రాముడు వెలిసిన రోజున వెయ్యేళ్ల భారతావనికి పునాది వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాముడు శక్తి కాదని, కాత్త శకానికి నాంది అని, రాముడు వివాదం కాదని, సమాధానం అని తెలిపారు. దేశ ప్రజలందరూ ఇక బాలరాముడిని అయోధ్యలో దర్శించుకోవచ్చని ఆయన అన్నారు.
అయోధ్యలో రామ విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తియింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అయోధ్య రాముడిని వివిధ మాధ్యమాల్లో చూడగలిగారు. అయోధ్య రామయ్య కనిపించిన దృశ్యాలు కట్టిపడేశాయి. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బిగ్ స్క్రీన్ లు వేసుకుని ఈ వేడుకను చూశారంటే రామయ్యా.. మజాకా.. అనిపించేంత రీతిలో ఈ మహత్తర వేడుక జరిగిందనే చెప్పాలి. లక్షలు కాదు.. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే రాముడిని నేడు తొలిసారి తిలకించి పునీతులయ్యామని ప్రజలు సంబరపడిపోతున్నారు.
దేశమంతా...
దేశమంతా పండగ వాతావరణం. ఊరు లేదు.. వాడ లేదు.. నగరం లేదు.. ఎక్కడ చూసినా రాములోరి సందడే. ఎక్కడ విన్నా ఆయన నామ స్మరణమే. అందుకే భారతదేశంలో రాములు వారికి అంత ప్రాధాన్యత. ప్రతి వీధిలో ఒక రాములోరి గుడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నిత్య పూజలు నిర్వహిస్తారు. నిత్య పారాయణం చేస్తారు. రామ భజనలతోనే గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. నవమి వేడుకలు వచ్చాయంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. పండగ మాదిరి...
ఈరోజు అందరూ పండగలాగే ఈ వేడుకను దేశ వ్యాప్తంగా జరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ బాాలరాముడి దర్శనం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నేడు ఆ కల సాకారమయింది. కళ్లముందు అయోధ్య రాముడు కనిపించాడు. ఇది చాలదూ.. ఈ జన్మకంటూ పెద్దవారు రామపారాయణం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయాల్లోనే కాకుండా ఇంట్లోనూ రామభక్తి ఈరోజు ఎంతలా కనపడిందంటే దాదాపు నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటం కోసం అందరూ పడిగాపులు కాశారు. నేడు ఫలించింది.