Ayodhya : చెక్కు చెదరని ఆలయం.. దేశంలో ఇదే మొదటిది.
Ayodhya : చెక్కు చెదరని ఆలయం.. దేశంలో ఇదే మొదటిది.
అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని అత్యంత ఆధునికతను జోడించి నిర్మించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. మూడేళ్ల పాటు శ్రమించి నిర్మించిన ఈ ఆలయంలో మరికాసేపట్లో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. మన దేశంలో పురాతన కాలంలో.. అంటే మన పూర్వీకులు నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. నాటి నిర్మాణ శైలి వేరు. కట్టడంలో వినియోగించిన వస్తువులు వేరు. అలా నిర్మించబట్టే నేటికి శతాబ్దాలు మారినా ఆ నిర్మాణాలు మనముందు సాక్షాత్కరిస్తున్నాయి.
పూర్వీకులు నిర్మించిన..
వాటిని చూసి మనం నాటి మన పూర్వీకుల ప్రతిభను గుర్తించడమే కాదు... అలనాటి జ్ఞాపకాలను కూడా పదిలం చేసుకుంటున్నారు. గుర్తు చేసుకుంటున్నాం. అలాంటిదే ఈ అయోధ్యరామాలయం కూడా. వెయ్యేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆలయాన్నినిర్మించారు. టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ఈ మేరుకు సాంకేతిక సహకారాన్ని అందించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ మందిరాన్ని నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ ఆలయం.. హిందూ మనోభావాలను ఏమాత్రం దెబ్బతినకుండా మరింత శోభించేలా ఆలయ నిర్మాణం జరుగుతుంది.
నగారా శైలిలో...
నగారా నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు. పూర్తిగా రాతితోనే ఆలయాన్ని నిర్మించారు. మూడువందల అరవై స్థంభాలతో మూడంతస్థులతో కూడిన ఈ ఆలయం భూకంపం వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరదు. రిక్టర్ స్కేల్ 6.5 తీవ్రత ఉన్నా ఈ ఆలయం తట్టుకునేలా నిర్మించారు. మన పూర్వీకులు వాడిన రాయినే ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. పునాదులు కూడా పటిష్టంగా ఉన్నాయి. కొన్ని తరాలు ఈ ఆలయాన్ని దర్శించుకునేలా ఈ అపురూప కట్టడాన్ని నిర్మిస్తున్నారు. అందుకే అయోధ్యకు అంత ప్రత్యేకత ఉంది. అందులోనూ రామాలయం కావడంతో మరింత విశిష్టత చేరింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి వాడిన వస్తువుల విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
అగ్రనేతలంతా...
ఇటు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ అగ్రనేతలంతా హాజరయ్యారు. అయోధ్య రామాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ఉద్వేగ భరితంగా ట్వీట్ చేశారు. ధర్మో రక్షిత రక్షిత: జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని ఆయన ట్వీట్ చేశారు. అనేక మంది ఇప్పటికే అయోధ్యలో వారికి కేటాయించిన స్థానాల్లో ఆశీనులయ్యారు.
అయోధ్యలో ఎన్ని విశేషాలో.. అక్కడికి వెళ్లలేని వారి కోసం మాత్రమే
అయోధ్యకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సప్త ముక్తి క్షేత్రాలలో ప్రధానమైనది. దేశంలో ఏడు పుణ్యక్షేత్రాలలో దేనినో ఒక్కదానిని దర్శించుకుంటే ముక్తిని పొందినట్లే భావిస్తారు. హిందువులు. అందులో అయోధ్య ప్రధానమైనది. మొదటిది. పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం భారత్ లో ఏడు క్షేత్రాలు సప్తముక్తి క్షేత్రాలుగా పేరుపొందాయి. అందులో అయోధ్య ప్రధానమైనది. మొదటిది. అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక క్షేత్రాలను దర్శించుకుంటే చాలు ధన్యులయినట్లే. అందుకే అయోధ్యతో పాటు ఈ ఆలయాలకు కూడా అంతటి ప్రాముఖ్యత భారదేశంలో ఉంది.
ఆధ్యాత్మిక వాతావరణం...
ఈ ఏడు పుణ్యక్షేత్రాల్లో మరణించే లోగా ఏదో ఒకదానిని దర్శించుకుంటే చాలు మరుజన్మ ఉండదని నమ్ముతారు. అది హిందువుల విశ్వాసం. నమ్మకం కూడా. పురాణాలు కూడా అదే చెప్పడంతో ఈ దైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తూ ఉంటుంది. నిత్యం ఈ క్షేత్రాలకు భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. సీజన్ తో సంబంధం లేకుండా నిత్యం భక్తులతో ఆలయాలు ఇవి. వీటిని దర్శించుకునేందుకు భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది వస్తుంటారు. అందుకే ఈ క్షేత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత అనాదిగా సంతరించుకుంది. ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో అయోధ్య రామాలయాన్ని ఒక్కసారైనా దర్శించుకుందామనుకునే వారికి రేపటి నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకునే ఉంటాయి.
రోజుకు రెండు లక్షల మందికి...
ఒకే సారి 1700 మంది భక్తులు ఆలయంలోకి ప్రవేశించేలా నిర్మాణం చేపట్టారు. రోజుకు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకునేలా వసతులతో పాటు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అయోధ్యకు అంతటి ప్రాధాన్యత ఉంది. అయోధ్యలో నేడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుండటంతో దేశమంతా పండగ వాతావరణం జరుపుకుంటుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే హాలిడే ప్రకటించింది. ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్ లోనూ అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు జరిగింది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ అయోధ్యలో అనేక విశేషాలున్నాయి.