సీఎంగా రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందంటే!!
సీఎంగా రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టింది. తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి మంత్రివర్గం కొలువుదీరింది. తొలి క్యాబినెట్ భేటి కూడా నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలినాడే దూకుడుగా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి హయాంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏవిధంగా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి పాలన ప్రభావం రియల్ ఎస్టేట్ పై సానుకూలంగా ఉంటుందా? ప్రతికూలంగా ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ చర్చనీయాంశంగా మారింది.
Real Broker Properies
గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని విధంగా ముందుకు వెళ్ళింది. గత పదేళ్లలో ఉద్యమ నాయకుడిగా పార్టీని ప్రారంభించి, రియల్ ఎస్టేట్ మీద ఏమాత్రం అనుభవం లేని కెసిఆర్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా దూకుడుగా ముందుకు వెళ్లేలా చేశారు. అంతేకాదు హైదరాబాదులోని భూముల ధరలు అమాంతం పెరిగేలా చేసి పక్క రాష్ట్రాల దృష్టిని ఆకర్షించారు.
అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందా? లేక చతికలబడుతుందా అన్నది అందరిలోనూ జరుగుతున్న చర్చ. అయితే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన ఉండడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంటుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ అని, కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీ తాను కట్టానని, తనకు రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం ఉందని అనేకమార్లు రేవంత్ రెడ్డి చెప్పారు. తన పురోగతిలో రియల్ ఎస్టేట్ రంగం దోహదం చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి సారిస్తానని, రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు కానివ్వరని చెప్పొచ్చు,
రియల్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అందనంత ఎత్తుకు చేరిన హైదరాబాద్ భూముల ధరలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో భవిష్యత్తులో ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని, ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకున్నా పరవాలేదు అనే భావన వ్యక్తం అవుతుంది.
Real Broker Properties